Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జనవరి 8 సాక్ష్యం న్యూస్: ఈ నెల 11,12,13 తేదీలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలోని నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించ నున్నట్లు స్థానిక MPP కంటుబోతు రాంబాబు తెలిపారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్ బుగత సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగే ఈ పోటీలకు యువత పెద్దఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. రూ 300/-ల ప్రవేశ రుసుమును చెల్లించి రూ7,000/-, 5000/-, 3000/-ల ఆకర్షణీయమైన నగదు బహుమతులను చేజిక్కించుకుని, తెలుగు సాంసృతి సాంప్రదాలకు అద్దం పట్టే సంక్రాంతి పండుగను అంతా ఎంజాయ్ చేయాలని కోరారు.
Admin
Neti Sakshyam