Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / అల్లూరి జిల్లా /అరకు : అక్టోబర్ 23 సాక్ష్యం న్యూస్ : అల్లూరి జిల్లా అరకు వేలి మండలం శిరిగం పంచాయితీ లంతంపాడులో మరో అద్బతం వెలుగు చూసింది. ఓవైపు పాల సముద్రాన్ని తలపిస్తూ.. మరోవైపు కొండల మద్యన మంచు పరుపును పరచినట్లు అద్బుతమైన ఆవిష్కరణ పర్యాటకులను కట్టిపడేస్తోంది. అరకు నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంత దృశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవనే చెప్పాలి.చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో పొగ మంచును చూస్తున్న పర్యాటకులు ఫిదా అవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
Reporter
Neti Sakshyam