Friday, 19 June 2026 01:22:56 PM

కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ పలువురికి ఆదర్శం. MLA గంటా

Date : 09 December 2024 12:10 PM Views : 1548

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 8 సాక్ష్యం న్యూస్: కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ 8వ వార్షికోత్సవం భీమిలి చిన్న బజారు డచ్ రోడ్డులో ఆ సంస్థ వ్యవస్థాపకలు కలిగొట్ల శ్రీరామ చంద్రమూర్తి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అథిదిగా పాల్గొని ఆయన చేతులమీదుగా తాళ్లవలస అనాధాశ్రమం, బోరవానిపాలెం అంధుల ఆశ్రమంలోని పిల్లలకు నిత్యావసరాలు, వస్త్రాలను పంపిణీ చేశారు. మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, కంప్యూటరు శిక్షణార్థులకు ధ్రువపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఎనిమిదేళ్ళుగా ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ.. ఫౌండేషన్ ఛైర్మన్ కలిగొట్ల శ్రీరామచంద్రమూర్తిని పలువురు మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో వీటా మైనింగ్ ప్రయివేటు లిమిటెడ్ ఎం.డి.పి. విజయభాస్కర్, ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కంపెనీ ఎం.డి. వై. శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు గాడు. వెంకటప్పడు, ఫౌండేషన్ ప్రతిని ధులు కె.ఎస్.ఎన్. మూర్తి, కె.వి.భానోజీరావు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: