Friday, 19 June 2026 01:42:47 PM

అవసరమైతే! పార కూడా పట్టుకుంటాం. ప్రాణాలు కాపాడుతాం.

Date : 16 February 2025 11:25 PM Views : 1279

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : పిబ్రవరి 16 సాక్ష్యం న్యూస్: అంతగా జనసంచారం లేని భీమిలి బీచ్‌ రోడ్డులో తరచూ ప్రమాదాలకు లోనై కొందరు గాయాలపాలవు తుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనంతటికీ మితిమీరిన వేగమే కారణమని తెలుస్తోంది. ఇందుకోసం ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ...మద్యం మత్తులో యవత మితిమీరిన వేగంతో స్పీడు బ్రేకర్లను సైతం లెక్కచేయకుండా ప్రమాదాలకు గురౌతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం తిమ్మాపురం నుంచి రామానాయుడు స్టూడియో వరకూ లారీల నుంచి జారిన గ్రావెల్ వాహన చోదకులకు పెద్ద తల నొప్పిగా మారింది. దీంతో పెట్రోలింగ్ నిర్వహింస్తోన్న పోలీసులు సతీష్, గణేష్ లు పనిముట్లతో తమ చేతులకు పని చెప్పి రోడ్డుపై మట్టిని తొలగించారు. పొంచి ఉన్న ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టిన భీమిలి స్టేషను సిబ్బంది సతీష్ మరియు గణేష్ లను పలువురు అబినందిస్తూ..వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: