Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబరు 14 సాక్ష్యం న్యూస్: జిల్లా విద్యాశాఖ అధికారి ( DEO) ప్రేమ్ కుమార్ సుడిగాలి పర్యటనలో భాగంగా మండలంలోని గొట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి రానున్న పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా 10వ తరగతి సాంఘీక శాస్త్రంనకు సంబందించిన కొన్ని ప్రశ్నలను విద్యార్ధిలను అడిగి సమాదానాలు రాబట్టారు. ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి పలు ససౌకర్యాలను కల్పిస్తోందని,వాటిని ఉపయోగించుకుని ప్రతి విద్యార్ది తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
Admin
Neti Sakshyam