Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : నవంబర్10, సాక్ష్యం న్యూస్: మండలంలోని మద్దిగ్రామంలో శ్రీధర్మ శాస్త అయ్యప్ప సేవా పీఠం వద్ద లక్షలాది రూపాయతో నిర్మించిన సాగరదుర్గ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఈ నెల 11 నుండి 13వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త బుగత సత్యనారాయణ తెలిపారు.11వతేదీ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 13వతేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠతో ముగుస్తాయని వివరించారు.అదే రోజుజ భారీ అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నామని.. బక్తులు పెద్దఎత్తున పాల్గొని సాగర దుర్గ అమ్మవారి మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులు ముఖ్య అథిదులుగా హాజరవుతారని పేర్కొన్నారు.
Admin
Neti Sakshyam