Wednesday, 16 September 2026 06:56:33 AM

సమాజానికి రక్షణగా ఉండేది పోలీస్ వ్యవస్థ మాత్రమే

Date : 09 December 2024 12:18 PM Views : 1568

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలూరు : డిసెంబర్ 9: సాక్ష్యం న్యూస్;ఏలూరు నగరం లోని రిటైర్డ్ పోలీస్ సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ పోలీసులు సంఘం నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా రిటైర్డ్ ఎస్సై రాంబాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్య చంద్ర రావు సమక్షంలో రిటైర్డ్ అడిషనల్ పోలీస్ ఎస్.పి విజయ రావు ,రిటైర్డ్ ఎస్సై దాశరధి , రిటైర్డ్ ఏ ఆర్ ఎస్ ఐ పేరాబత్తుల రాంబాబు సమక్షంలో విశ్రాంత పోలీస్ అధికారుల కలయిక కార్యక్రమం జరిగినది .ఈ కలయిక గొప్పవిషయమి పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువిషయాలను చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ కాకర్ల శ్రీను పాల్గొని మాట్లాడారు. పోలీసు వృత్తి చాలా కఠినమైనదని నీతి నిజాయితీలతో ప్రజలకు సేవ చేసి ఎంతోమందికి మంచి భవిష్యత్తును అందించిన విశ్రాంత పోలీసుల సేవలు ప్రజలు మరువలేరని కాకర్ల శ్రీను అన్నారు. రిటైర్డ్ పోలీసుల ఆత్మీయ కలయికలో తాను కూడా పాల్గొనడం తన అదృష్టమని భావించారు. ఈ సందర్భంగా కాకర్ల శ్రీను ను పలువురు రిటైర్ పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :