Monday, 15 June 2026 08:47:48 PM

జోన్-3 మధురవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Date : 26 January 2025 08:38 PM Views : 1381

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : జనవరి 26 సాక్ష్యం న్యూస్: దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ జిల్లా మధురవాడ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జోన్-3 మధురవాడ విద్యుత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాట యోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులు, విద్యుత్ సిబ్బందితో కలసి జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో JAO రమణమూర్తి, ADEలు రొంగలి రమేష్,AEలు సైలజ,నరేష్, అప్పలనాయుడు, JEలు D.J. రమేష్ కుమార్, సరళ,కోటేశ్వరరావు,మరియు లైన్ ఇన్స్పెక్టర్ లు, లైన్ మెన్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :