Wednesday, 19 November 2025 04:30:25 AM

నవంబర్ 30న అనంత పద్మనాభస్వామి కొండ మెట్ల కోటి దీపోత్సవం.

Date : 08 November 2024 03:55 PM Views : 1949

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : నవంబర్ 8,సాక్ష్యం న్యూస్: పద్మనాభం పుణ్యక్షేత్రంలో ఎత్తైన కొండపై వేంచేసియున్న అనంత పద్మనాభస్వామి కొండమెట్ల కోటి దీపోత్సవానికి ఆలయ అర్చక బృందం ముహూర్తం ఖరారు చేసారు. నవంబర్ 30 న ఈ వేడుక జరిపేందుకు అధికారులు, అర్చకులు సన్నద్దమవుతున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరిలో రానున్న బహుళ అమావాస్య రోజున ఈ కోటి దీపోత్సవం జరపడం ఇక్కడ పూర్వం నుండి వస్తున్న ఆచారం. అయితే ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరపడానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకుంటున్నారని అధికారులు,టీడీపీ నాయకులు చెప్పిన సమాచారం. మరో వారం రోజులలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ దీపోత్సవంకి సంబందించి సన్నహా సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2025. All right Reserved.



Developed By :