Friday, 19 June 2026 01:53:39 PM

అప్పన సన్నిధిలో నారాయణ్ సేవా దళం.

Date : 02 January 2025 09:31 AM Views : 1885

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ సింహాచలం : జనవరి1 సాక్ష్యం న్యూస్: ఆద్యాత్మికతతో కూడిన సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్న నారాయణ్ సేవా దళం భక్తుల ప్రశంసలు పొందుతోందని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు అన్నారు. సింహగిరి అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన నారాయణ్ సేవా దళం నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ 2025 నూతన సంవత్సరంలో నారాయణ్ సేవా దళం మరిన్ని ఆలయాలలో సేవలను ఉదృతం చేస్తూ.. అప్పన్న ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అంతకుముందు నారాయణ్ సేవా దళం నూతన సంవత్సరం క్యాలెండర్‌ ను A.Eo ఆనంద్ కుమార్, స్థానాచార్యులు T.P రాజగోపాల్, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, నారాయణ్ సేవా దళం వ్యవస్థాపకులు బత్తుల పవన్ కుమార్, గౌరవ అధ్యక్షులు పర్వతం శ్రీరామ చంద్ర మూర్తి సమక్షంలో 2025 కేలండరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా దళం గ్రూప్ అడ్మిన్స్ లక్ష్మీ పెనుమత్స, రాఘవి, ఉమామహేశ్వరి, జగదీశ్వరి, రమణమ్మ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: