Wednesday, 16 September 2026 06:58:42 AM

లబ్ధిదారులతో కాలనీలను పూర్తి చేయించాలి

Date : 21 October 2024 08:08 PM Views : 1185

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 21 సాక్ష్యం న్యూస్: మండలంలోని పలు గ్రామాలలో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలనీలను లబ్దిదారులతో త్వరిత గతిన పూర్తి చేయించకపోతే సహించేది లేదని మండల ప్రత్యేక అధికారిణి డి.సునీత గ్రామ సచివాలయ అధికారులను హెచ్చిరించారు. సోమవారం సాయంత్రం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఒ విజయకుమార్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలో పలు గ్రామాలలో నేటివరకు ప్రారంభం కాని 220 కాలనీల పనులను లబ్దిదారులతో ప్రారంభించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కాలనీలను కూడా పూర్తయ్యేటట్లు చూడాలని సూచించారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :