Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : నవంబర్12,సాక్ష్యం న్యూస్;మండలంలోని అనంతవరం గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న పి.డి.ఎస్.బియ్యాన్ని పద్మనాభం సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకుని.ఇందుకు సంబంధించిన ఆటోను,డ్రైవర్ అప్పలరాజుని పద్మనాభం పోలోసులకు అప్పగించారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాడివలస అప్పలరాజు తన ఆటోపై తరలిస్తున్న సుమారు 800 కేజీల పి.డి.ఎస్.బియ్యాన్ని అనంతవరం గ్రామ సమీపంలో ఉన్న కోళ్లఫారం వద్ద సివిల్ సప్లై అధికారులు పట్టుకొని సీజ్ చేసి తమకు అప్పగించినట్లు సి.ఐ.తెలిపారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడివలస అప్పలరాజుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Neti Sakshyam