Tuesday, 25 August 2026 06:44:56 AM

రైతు బిడ్డ నేత్రదానం, పలువురి అభినందనలు

Date : 11 November 2024 05:28 PM Views : 1660

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : నవంబర్11,సాక్ష్యం న్యూస్ , భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ప్రముఖ రైతు బిడ్డ మొగళ్ళ పాండు రంగ విఠల్ కొండల రాయుడు (64) మరణానంతరం నేత్రదానం చేశారు. హైదరాబాద్ కు చెందిన అమ్మా నేత్ర, అవయువ, శరీర దానం ప్రోత్సాహికు సంఘం ఏలూరు జిల్లా కో ఆర్డినేటర్ టి. సుమన్ బాబు ప్రోత్సాహంతో మొగళ్ళ పాండు కుటుంబ సభ్యులు అంగీకారంతో సోమవారం నేత్ర దానం చేశారు. ప్రముఖ కంటి శస్త్రచికిత్స వైద్య సంస్థ అయిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్టిస్టూట్ సిబ్బంది స్థానిక నిడదవోలు రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది ఈమేరకు రెటీనా సేకరించారు. ఈసందర్భంగా జిల్లా కో ఆర్డినేటర్ సుమన్ బాబు మాట్లాడుతూ పాండు రంగ విఠల్ ఆశయం ఎందరికో స్ఫూర్తి దాయకం అని సహరించిన కుటుంబ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరణానంతరం మనిషిని కాలిస్తే బూడిద అవుతుందని పాతిపెడితే మట్టిలో కలిపోతారని సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతీఒక్కరూ నేత్రదానం, అవయువ దానం, శరీర దానం చేయటానికి ముందుకు రావాలని సుమన్ బాబు కోరారు. పాండు రంగ విఠల్ నేత్ర దానం చేయటం పట్ల పలువురు అభినందించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: