Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : మే 22 తగరపువలస సాక్ష్యం న్యూస్: హనుమాన్ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ నగర పరిధి భీమునిపట్నం చిల్లపేట శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. బుధవారం రాత్రి నుంచి తెల్లవార్లూ ఆలయ ఆవరణలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిల్లపేట పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విశేషంగా తరలిరాగా... ఆలయ కమిటీ భక్తులకు తీర్దప్రసాదాలను అందజేసింది.
Admin
Neti Sakshyam