Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : మే 26 మధురవాడ సాక్ష్యం న్యూస్: విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సోమవారం మధురవాడ సబ్ రిజిస్ట్రారు కార్యాలయం వద్ద మజ్జిగ ప్యాకెట్లు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సబ్ రిజిస్టార్ చక్రపాణి చేతులమీదుగా ప్రారంభించగా... వెయ్యి మజ్జిగ ప్యాకెట్లను విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రజలకు పంపిణీ చేసింది. ఈ మండు వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని... ఇటీవల లక్ష రూపాయల చెక్కును భారత పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్ల కుటుంబాల కొరకు అందజేయడం జరిగిందని సంఘం కార్యదర్శి ముళ్ళపూడి కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.వి.ఆర్.ఎస్. ప్రసాద్, భయర్రాజు చంద్రశేఖర్, వాసుదేవరావు, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam