Saturday, 01 August 2026 01:39:42 AM

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 'భవిత'

Date : 16 May 2025 08:53 PM Views : 892

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : మే 16 సాక్ష్యం న్యూస్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి భవిత సెంటర్ కు పంపించాలని జిల్లా సహిత విద్యా సమన్వయ అధికారిణి గీత కోరారు. భీమిలి ప్రాంతంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని గుర్తిచే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా అభియాన్ ఆద్వర్యంలో 0 నుండి 18 సంవత్సరాల ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు కార్యక్రమం ఈ నెల 12 నుండి జూన్ 9 వరకు కొనసాగుతుందని తెలిపారు. గుర్తించిన ప్రత్యేక పిల్లలును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి భవిత సెంటర్ కు పంపించాలని సూచించారు. వారికి అవసరమైన ప్రత్యేక రాయితీలను సమగ్ర శిక్ష ద్వారా అందజేస్తామని, 10 th పాసయ్యిన పిల్లలును కళాశా లలో చేర్పించాలని శుక్రవారం మూలకుద్దు గ్రామములో ఇద్దరు పిల్లల్ని గుర్తించామని, మండలంలో 6 గురు ప్రత్యేక అవసరాలు గల పిల్లలును గుర్తించామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో APC అప్పలనాయుడు, MEO 1 శివరాణి, మూలకుద్దు UP స్కూల్ టీచర్స్, HM దాలయ్య బాబు, భవిత స్కూల్ టీచర్స్ కెజియా కుమారి, పార్వతి మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: