Monday, 24 August 2026 05:13:45 AM

క్రీడల్లో గెలుపు ఓటమి సహజమే.

Date : 11 December 2024 03:15 PM Views : 1439

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబరు 11 సాక్ష్యం న్యూస్: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా భావించి ముందుకు సాగాలని ఎంచుకున్న క్రీడల్లో అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. గురువారం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ఆవరణలో బాలికల కో కో క్రీడా పోటీలను గోపన్న పాలెం గ్రామం మాజీ సర్పంచ్ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్( మిల్లు బాబు),శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నతానియల్ తో కలిసి బాలికల కో కో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్స్ ఏలూరు అసోసియేషన్ అధ్యక్షులు ఆదిరెడ్డి సత్యనారాయణ, కోకో అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రంగారావు,ఎరకుల సాంబశివరావు ,గోపన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలసాని శ్రీధర్ ,టిడిపి నాయకులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ మారగాని సత్యనారాయణ, టిడిపి నాయకులు ఏనుగు కేబుల్ శ్రీను,బజారు గణేష్, చమళ్ళమూడి రాము, తెలుగు యువత నాయకులు బోర్రా చందు,జనసేన నాయకులు గోపన్న పాలెం గ్రామం మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు,భారతీయ జనతా పార్టీ దెందులూరు మండల అధ్యక్షులు మండూరి బుజ్జి గోపాల్, పలువురు టిడిపి జనసేన భాజపా నాయకులు పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :