Tuesday, 15 September 2026 05:26:18 AM

ఆత్మహత్యకు పాల్పడ్డ కోరాడ నాగభూషణం

Date : 10 April 2025 02:12 PM Views : 1370

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : భీమిలి మాజీ వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకుడు కోరాడ నాగభూషణం విషాదకర మృతి కలచివేసింది. విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... నాల్గవ అంతస్తు పైనుంచి దూకి ఆయన ఆత్మహత్యకు పాల్పడారు. విశాఖ జిల్లా, ఆనందపురం మండలం వేములవలస పంచాయతీకి చెందిన నాగభూషణం, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. గణేష్ నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ, ఓ ఆధ్యాత్మిక నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ... ఎన్నోమందిలో ఆశాజ్యోతి రేపిన ఈయన, ఈరోజు అందరికీ విషాదాన్ని మిగిల్చారు. పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమా? లేక మరోదేదైనా కారణముందా అన్నది... ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: