Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / రాజమహేంద్రవరం : నవంబర్ 14 సాక్ష్యం న్యూస్: జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని,శ్రీ సాధు జనార్దన మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాధు వెంకట కోటేశ్వర రావు విద్యార్థుల నుద్దేశించి అన్నారు. రాజమహేంద్రవరం ఇ న్నీసు పేట శాఖా గ్రంధాలయంలో 57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనం పోటీలు నిర్వహించారు. పుస్తకాలు చదవడం ద్వారా మానసిక ఉల్లాసం, విషయ పరిజ్ఞానం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు సభ్యులు శ్రీ చలు మూ రి సత్యనారాయణ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam