Friday, 19 June 2026 01:36:11 PM

అనంత పద్మనాభస్వామి కొండపైకి రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్

Date : 26 October 2024 08:40 AM Views : 1540

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 25,సాక్ష్యం న్యూస్: పద్మనాభం పుణ్యక్షేత్రంలో ఎత్తైన గిరిపై వేంచేసియున్న అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ సందర్శించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాంజనేయస్వామి,ఆలయ ఈ ఒ ఎస్.నానాజీబాబు లు పూర్ణకలశంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం అసంపూర్తిగా ఉన్న అనంతుని ఆలయ పనులను, ఘాట్ రోడ్డు పనులను పరిశీలించారు. ఆలయానికి రాబడి లేక ఆలయ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సింహాచలం దేవస్థానం స్వామివారికి రసవర్గం ఇచ్చేదని,గత కొన్ని సంవత్సరాల నుండి నిలిపివేసిందని,దీంతో స్వామివారికి రసవర్గం కూడా కష్టతరం అవుతుందని ఆలయ అర్వకులు తెలిపారు. అనంతని ఆలయాన్ని సింహాచలం దేవస్ధానంలో విలీనం చేయాలని కోరారు. ఆలయాన్ని, ఘాట్ రోడ్డును త్వరలో పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: