Sunday, 13 September 2026 04:20:25 AM

కోలాహలంగా పద్మనాభుని పెళ్ళి రాట

Date : 06 March 2025 04:36 PM Views : 1500

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : మార్చి (6) భీమునిపట్నం సాక్ష్యం న్యూస్ : ఈనెల 10 వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కుంతీ మాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్ళిరాట కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం పసుపు దంచి పెళ్ళి పనులను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ తాలాడ పాప, పద్దు దంపతులు ఈ కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు. అంతకుముందు స్థానిక మహిళలు ఆలయ ప్రాంగణాన్ని శుబ్రంచేసి ముగ్గులు వేయడంతోపాటు..పూల దండలు, మామిడి తోరణాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.ఆలయ ఇ.వో నానాజీ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో MPTC కండుబుక్త ఎర్రనాయుడు ,లక్ష్మి దంపతులు, టిడిపి నాయకులు కాళ్ళ నగేష్ కుమార్, తాలాడ పైడిరాజు,మొకర సన్నిబాబు, మరియు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: