Monday, 24 August 2026 05:15:15 AM

మహాగర్జనకు మాలలయ తరలి రావాలి

Date : 27 October 2024 04:32 PM Views : 1488

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలూరు : అక్టోబర్ 27 సాక్ష్యం న్యూస్ : అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 26న బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో మాలల మహా గర్జన సభకు తరలి రావాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ఐఆర్ఎస్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్, మాలమహా సేన జాతీయ అధ్యక్షుడు అలగ రవి కుమార్ లు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక లేడీస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సుప్రీం కోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక యస్ సి, యస్ టి, రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభకు గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ ఐఏఎస్ జిఎస్ఆర్ కెఆర్. విజయ్ కుమార్, ఏఐఎమ్ ఐపిఎస్ పివి సునీల్ కుమార్, మహాకవి బోనిగల రామారావులు పాల్గొంటారని, ఈ సభకు మాల జాతి అతిరధ మహారదుల, సమస్థ మాలసంఘా ల పెద్దలు హాజరవుతారని పేర్కొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :