Monday, 09 February 2026 04:35:24 AM

MPDO కార్యాలయంలో సోలార్ పై అవగాహన సదస్సు.

Date : 27 November 2024 08:50 PM Views : 1939

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : నవంబర్ 27 సాక్ష్యం న్యూస్: పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని APEPDCL ఆపరేషన్ డివిజన్ జోస్ - 3 కార్య నిర్వాహక ఇంజనీర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు.తేదీ 28/11/2024 న ఉదయం 10.00 గంటలకు ఆనందపురం MPDO సమావేశ మందిరంలో పీఎం సూర్య గృహయోజన క్రింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అథిదిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి విశాఖ జిల్లాలో గల సోలార్ వెండర్స్, బ్యాంక్ అధికారులు హాజరుకానున్నారని, గృహ విద్యుత్ వినియోగదారులందరు తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని పోలాకి శ్రీనివాసరావు పిలునిచ్చారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :