Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / అల్లూరి జిల్లా /అరకు : అక్టోబర్ 23 సాక్ష్యం న్యూస్: అరకు వెళ్ళే పర్యాటకులకు గుడ్ న్యూస్ పద్మాపురం బొటానికల్ గార్డెన్ లో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 11, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 1500/- రుసుము చెల్లించి 15 నిమిషాల పాటు నింగిలో విహరించవచ్చని నిర్వాహకులు తెలిపారు. దీనిద్వారా మంచు తెరలు, వలిసె పూల అందాలను పర్యాటకులు మరింత ఆస్వాదించనున్నారు.
Reporter
Neti Sakshyam