Tuesday, 25 August 2026 06:43:24 AM

50 కిలోల గంజాయి పట్టివేత – ఐదుగురు అరెస్ట్

Date : 30 April 2026 10:28 AM Views : 203

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / అనకాపల్లి జిల్లా : ఏప్రిల్అ 30 :నకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి కాకినాడకు తరలిస్తున్న 50 కిలోల గంజాయిని కేడీపేట సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. ఎస్‌పీ తుహిన్ సిన్హాకు అందిన సమాచారంతో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఒక కారు, మూడు బైకులు, ఐదు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :