Wednesday, 12 August 2026 08:50:46 PM

వాహన ప్రమాద రహిత రాష్ట్రంగా ఏ పి

Date : 15 November 2025 06:36 PM Views : 388

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : నవంబర్ 15 సాక్ష్యం న్యూస్: అభినవ ఆంధ్ర వాహన ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం లో వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం నిర్మాణ పనులను శనివారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వరరావు తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మానవ రహిత మానవ ప్రమేయం లేకుండా కెమెరాలు ఇతర సెన్సార్లు సహాయంతో వాహనదారుడు డ్రైవింగ్ పరీక్షించే ఆధునిక మార్గం ను మంత్రి పరిశీలించారు. డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు వచ్చిన వాహనదారులతో కాసేపు మంత్రి ముచ్చటించారు. సెన్సార్లు, కెమెరాల పనితీరు ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వాహన సామర్ధ్య పరీక్షా కేంద్రాలు నిర్మాణం చేపట్టమన్నారు. ఇందుకోసం 16 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గంభీరం వాహన సామర్థ్యం పరీక్ష కేంద్రం ఇప్పటికే మూడున్నర కోట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు అత్యాధునిక సౌకర్యాలు పరిజ్ఞానంతో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే సగం జిల్లాలలో ప్రారంభించామన్నారు. పలు విద్యాసంస్థలు కార్యాలయంలో వాహన ప్రమాదాల నివారణలపై నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డిటిసి ఆర్సిహెచ్ శ్రీనివాస్, ఇంచార్జ్ ఆర్టీవో రామ్ కుమార్,సీనియర్ ఇన్స్పెక్టర్ లు వేణుగోపాలరావు, బుచ్చిరాజు, బాలాజీ రావు, ప్రకాశ్,అసిస్టెంట్ మోటార్స్ ఎం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: