Tuesday, 25 August 2026 06:44:44 AM

బ్రేక్ వేయండి బ్రేక్ ఫాస్ట్ రెఢీ... అడ్డుపెడతాం.! అడిగేదెవరు.?

Date : 08 August 2025 01:44 PM Views : 901

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగష్టు 8 సాక్ష్యం న్యూస్: ఇప్పటికే భీమిలి- విశాఖ బీచ్ రోడ్డులోని రబ్బరు స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులు నరక యాతన అనుభవిస్తుంటే.. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో 'మార్లన్ కే' రెస్టారెంట్ ముందు స్టాపర్లు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వాహనాలు, బస్సు, లారీలు వీటిని తప్పించుకుని వెళ్ళడం సవాలుగా మారుతోంది. వేగ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయాల్సిన వీటిని ప్రయివేటు వ్యక్తులే ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. పోనీ పెడితే... పెట్టారు. వాటిపై 'STOP సిటీ పోలీస్' అని వ్రాయాల్సిన స్థానంలో 'బ్రేక్ ఫాస్ట్' అని రెస్టారెంట్ పేరును హైలెట్ చేసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలా ఎవరి వ్యాపారాల ముందు వారే వ్యాపార ప్రకటనలు చేసుకుంటూ రహదారి వ్యవస్థలకు భంగం కలిగించడం సబబు కాదంటున్నాయి ప్రజా సంఘాలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: