Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : అక్టోబర్ 22 సాక్ష్యం న్యూస్: శ్రావణమాసం ఐదవ శుక్రవారం సందర్భంగా భీమునిపట్నం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూరగాయలతో అందంగా అలంకరించారు. దీంతో అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వాసవి అష్టకం, మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామ పారాయణ జరిపించి శ్రీహరి కుసుమాంబ కోలాటం వారిచే కోలాటం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వంశపారంపర్య అర్చకులు సత్య సాయి శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు శ్రీ పూసర్ల శ్రీనివాస్,కార్యదర్శి బొండా బాలాజీ, కోశాధికారి ఉల్లి ఆదినారాయణ మూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు ముమ్మిడిశెట్టి సునీల్, వాసవి ప్రార్ధన మందిర సంఘ అధ్యక్షులు కట్టమూరి వెంకన్న బాబు కార్యదర్శి కంచర్ల కామేష్ కోశాధికారి బొండా కిరణ్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు గుగ్గిళ్ళ ప్రవల్లిక, కార్యదర్శి కొత్త విజయ కోశాధికారి సౌమ్య మరియు ఆర్యవైశ్య పెద్దలు ముమ్మిడిశెట్టి సత్యానందరావు, గుగ్గిళ్ళ రామకృష్ణ, కట్టమూరి విజయ్ కృష్ణ, దుర్గా మూర్తి, గుగ్గిళ్ళ క్రిష్ణ శాస్త్రి, కొత్త రామక్రిష్ణ, మణికంఠ స్వీట్స్ అధినేత ఆదిమూలం నాగరాజు తదితరులు పాల్గొన్నా
Admin
Neti Sakshyam