Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగష్టు 8 సాక్ష్యం న్యూస్: శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమిలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మునుపెన్నడూ చేయని విధంగా అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం తోపాటు వాసవి అష్టకం, మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామ పారాయణ చేసి, సప్త హారతులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని జరిపించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందించడం తోపాటు రాఖీలు పంపిణీ చేసి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు శ్రీ పూసర్ల శ్రీనివాస్,కార్యదర్శి బొండా బాలాజీ, కోశాధికారి ఉల్లి ఆదినారాయణ మూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు ముమ్మిడిశెట్టి సునీల్, కార్యదర్శి ఉసిరికల విశ్వేశ్వరరావు, కోశాధికారి ఉసిరికల వెంకటేష్ వాసవి ప్రార్ధన మందిర సంఘ అధ్యక్షులు కట్టమూరి వెంకన్న బాబు, కార్యదర్శి కంచర్ల కామేష్, కోశాధికారి బొండా కిరణ్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు గుగ్గిళ్ళ ప్రవల్లిక, కార్యదర్శి కొత్త విజయ కోశాధికారి సౌమ్య, మరియు ఆర్యవైశ్య పెద్దలు పోలిశెట్టి వెంకటేష్, గుగ్గిళ్ళ శేఖర్, గుగ్గిళ్ళ రాజేశ్వరరావు, గుగ్గిళ్ళ రంగనాయకులు, మణికంఠ స్వీట్స్ అధినేత ఆదిమూలం నాగరాజు,పులవర్తి రాము, గుగ్గిళ్ళ క్రిష్ణ శాస్త్రి, కొత్త రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam