Wednesday, 19 November 2025 04:30:23 AM

కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ. ఎందుకంటే.!

Date : 25 July 2025 05:48 PM Views : 391

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జులై 25 సాక్ష్యం న్యూస్: శ్రావణ శుక్రవారం మొదటి వారాన్ని పురస్కరించుకొని భీమిలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. మునుపెన్నడూ జరగని విధంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు పూసర్ల శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 10/-20/-50/-100 నోట్లతో 3,80,000/-ల నగదును ఉపయోగించామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొండా బాలాజీ, కోశాధికారి ఉల్లి సత్యనారాయణమూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు ముమ్మిడిశెట్టి సునీల్, కార్యదర్శి ఉసిరికల విశ్వేశ్వరరావు, కోశాధికారి ఉసిరికల వెంకటేష్ వాసవి ప్రార్ధన మందిర సంఘ అధ్యక్షులు కట్టమూరి వెంకన్న బాబు కార్యదర్శి కంచర్ల కామేష్ కోశాధికారి బొండా కిరణ్ ఆర్యవైశ్య పెద్దలు పోలిశెట్టి వెంకటేష్, మాదా వెంకట పార్వతీశం, ఉసిరికల సతీష్, సబ్బిశెట్టి శ్రీను, గుగ్గిళ్ళ కృష్ణ శాస్త్రి, కొత్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2025. All right Reserved.



Developed By :