Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : మే 29 సాక్ష్యం న్యూస్: యోగా వలన శారీరక,మానసిక ఆరోగ్యం తోపాటు విద్యార్దుల్లో ఏకాగ్రత పెరుగుతుందని భీమిలి SVLNS ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ అన్నారు. యోగాంధ్ర 2025 ప్రచార కార్యచరణ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఒక్కరోజు యోగ శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. యోగా ఫర్ ఓన్ 'ఎర్త్' ఓన్ 'హెల్త్' నినాదంతో యోగాపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. యోగా వలన మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు కలుగుతాయని, దీనిని దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం మంచిదన్నారు.
Admin
Neti Sakshyam