Wednesday, 12 August 2026 07:32:25 PM

స్క్రాప్‌తో సృజనాత్మకతకు శ్రీకారం… ‘వేస్ట్ టు వండర్స్

Date : 04 April 2026 05:18 PM Views : 368

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 4 : GVMC కమిషనర్ ఆదేశాల మేరకు “వేస్ట్ టు వండర్స్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భీమునిపట్నం జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెల్డింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ వర్క్స్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని అన్ని వెల్డింగ్ షాప్ యజమానులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పనికి రాని స్క్రాప్ వస్తువులను వినియోగించి ఆకర్షణీయమైన, వినూత్నమైన కళాఖండాలను తయారు చేయాలని తెలిపారు. అలాగే జీవీఎంసీ నిర్వహించే పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు భీమునిపట్నం జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన రూపంలో మార్చడం మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని తెలిపారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: