Friday, 01 May 2026 03:23:26 AM

భీమిలి చేరుకున్న వందేభారత్ సైకిల్ యాత్ర.

Date : 06 February 2026 09:33 PM Views : 229

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 06 సాక్ష్యం న్యూస్: సముద్రం…మన జీవనాధారం…మన భద్రతకు కూడా సవాలు విసిరే సరిహద్దు… ఈ తీర ప్రాంతాల భద్రత కోసం… మత్యకారుల్లో అప్రమత్తత పెంచేందుకు… దేశభక్తి జ్వాలలను రగిలించేందుకు… సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్… ‘వందే భారత్’ నినాదంతో చేపట్టిన సైకిల్ యాత్ర… భీమిలి తీరాన్ని చేరుకుంది. దేశ సేవే ధ్యేయంగా… కిలోమీటర్ల కొద్దీ సైకిళ్లపై ప్రయాణించడం… తీర ప్రాంత గ్రామాలను చేరుకోవడం… సముద్ర భద్రతపై అవగాహన కల్పించడం… అనుమానస్పద కదలికలపై వెంటనే సమాచారమివ్వాలని సూచించడం..వంటి అంశాలపై మత్యకారులను అప్రమత్తం చేస్తున్నారు CISF సిబ్బంది. భీమిలి చేరుకున్న ఈ యాత్రకు… స్థానిక మత్యకారులు… స్వచ్ఛంద సంస్థలు… ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, మరియు భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. పూలమాలలు… చప్పట్ల నడుమ… జవాన్లకు ఘనాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో… సముద్ర మార్గాల్లో భద్రతా జాగ్రత్తలు… అనుమానాస్పద పడవలు లేదా వ్యక్తులపై సమాచారం ఇవ్వాల్సిన విధానం… మత్యకారులకు వివరించారు అధికారులు. దేశ భద్రతలో… మత్యకారుల పాత్ర ఎంతో కీలకమని… ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడే సైనికులే కాదు… సరిహద్దుల దగ్గర జీవించే ప్రతి పౌరుడూ… ఒక సైనికుడే… అదే సందేశాన్ని తీసుకెళ్తోంది… ఈ ‘వందే భారత్’ సైకిల్ యాత్ర. అంటూ కార్యక్రమం ఘనంగా ముగిసింది.ఈ సందర్భంగా భీమిలి ప్రెస్ క్లబ్ సభ్యులు cisf ప్రథినిధులను జ్ణాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :