Friday, 19 June 2026 01:56:17 PM

వేములవలసలో ఉచిత నేత్ర వైద్యశిభిరం

సాక్ష్యం న్యూస్

Date : 15 November 2025 06:30 PM Views : 336

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : నవంబరు 15 సాక్ష్యం న్యూస్: ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆనందపురం. అభినవ ఆంధ్ర కార్యక్రమాన్ని వేములవలస మహాత్మా గాంధీ డైలీ మార్కెట్ ప్రక్కన గల మసీదు దగ్గర నియో విజన్ కంటి ఆసుపత్రి మధురవాడ వారి వైద్యులచే కంటి వైద్యం మరియు చర్మ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం కంటికి సంబంధించి నలభై మందికి, చర్మ వ్యాధుల కు సంబంధించి పది మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పది మందికి అవసరమైన మందులు ఇచ్చారు ఆరుగురిని కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి, ఆపరేషన్ నిమిత్తం మధురవాడ మిధిలాపురి నియో విజన్ కంటి ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్ కోసం పంపించారు కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు ప్రారంభించగా ఈ కార్యక్రమం లో నియో విజన్ ఐ డాక్టర్ బాలకృష్ణ , స్కిన్ డాక్టర్ సుహాసిని, క్యాంప్ మేనేజర్ పవన్ కుమార్, ఆప్తిమిస్ట్ జ్ఞానేశ్వరి , స్కిన్ అసోసియేట్ లావణ్య, రజ్వీ , పడాల రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: