Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 6 : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి తామీమ్ అన్సారి, IAS గారిని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేట్ ప్రెసిడెంట్ పి. ఆనంద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వి. బలరామి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో Non-Teaching సిబ్బంది సమస్యలపై ప్రతినిధులు రెప్రజెంటేషన్ సమర్పించారు. ముఖ్యంగా పదోన్నతులు, B.Ed డిస్టెన్స్ అనుమతి, నాన్-టీచింగ్ సిబ్బంది బలోపేతం వంటి అంశాలు ప్రస్తావించారు. వివిధ జిల్లాల నుంచి అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam