Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 19 సాక్ష్యం షార్ట్ న్యూస్ – భీమిలి స్థానిక సన్ స్కూల్‌లో గురువారం "కిడ్స్ కార్నివాల్" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీ లావణ్య, సొసైటీ సభ్యులు కైతపల్లి భరద్వాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులు రాణి రుద్రమదేవి, ఛత్రపతి శివాజీ ఏకపాత్రాభినయాలు, జానపద–సాంప్రదాయ నృత్యాలు, యోగా ప్రదర్శనలు, ఫ్యాషన్ షోతో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన వారికి హోటల్ బ్లిస్ యాజమాన్యం అల్పాహారం ఏర్పాటు చేసింది.
నృత్యాలతో అలరిస్తున్న చిన్నారులు
విజేతలకు బహుమతులు అందజేస్తూ
Admin
Neti Sakshyam