Friday, 19 June 2026 01:33:31 PM

విశాఖ జోన్ 1 కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి

Date : 07 December 2025 05:10 AM Views : 343

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖపట్నం : డిసెంబరు 6 సాక్ష్యం న్యూస్: తరాలు మారినా...యుగాలు మారినా...అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే బాధ్యత అందరిపై ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ జోన్ 1 పోలాకి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ జోన్ 1కార్యాలయములో మహనీయుని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు... డా. బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా, ఆయన చూపిన సమానత్వం–సేవా మార్గం మనకు స్ఫూర్తి. ప్రజల ఇళ్లలో వెలుగు నిలిచేలా నిరంతరం కష్టపడుతున్న ప్రతి విద్యుత్ ఉద్యోగి, నేటి సమాజ నిర్మాణంలో నిజమైన శ్రామికుడని ఆయన చెప్పిన విలువలు మనకు గుర్తు చేస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అకౌంట్స్, ఆఫీసర్ అకౌంట్స్, అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ జూనియర్ ఇంజనీర్, విద్యుత్ ఉద్యోగులు, డివిజన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :