Wednesday, 12 August 2026 07:33:45 PM

భీమిలి దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం.

Date : 19 September 2025 12:45 PM Views : 714

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 19 సాక్ష్యం న్యూస్; రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన కొన్ని విధానాల వలన దస్తావేజుల తయారీ జటిలమవ్వడం మరియు తీవ్ర జాప్యం అవుతోందని భీమునిపట్నం దస్తావేజుల సంక్షేమ సంఘం తెలిపింది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు భీమిలి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా దస్తావేజు లేఖరులు నిరసన తెలిపారు.స్థానిక సంస్థల డేటా బేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన CARD PRIMME సాఫ్ట్వేర్లోని సాంకేతిక లోపాల వలన దస్తావేజు తయారీ అనేది జటిలమవుతూ తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీంతో అటు ప్రజలకు, ఇటు దస్తావేజు లేఖరులు విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విధానాలలో మార్పు అవసరమని ప్రభుత్వానికి నివేదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు సెప్టెంబరు 19, మరియు 20 తేదీలలో పెన్ డౌన్ చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులు మరియు రిజిస్ట్రేషన్లకు సంబంధిం ఏలాంటి సేవలు అందించబడవని పేర్కొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: