Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జులై 8 మంగళవారం సాక్ష్యం న్యూస్: భీమిలికి చెందిన ఫిజియో థెరపిస్ట్ ఆదిత్య ముమ్మిడిశెట్టి, CBM హైస్కూల్ పూర్వ విద్యార్థి శ్రీరామమూర్తి స్ధానిక "వివేకానంద రీడింగ్ రూమ్ కు కుర్చీలను బహుకరించారని...యువ భారత్ అధ్యక్షుడు సంకురుభక్త జోగారావు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రీడింగ్ రూం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో "యువ భారత్" గౌరవ అధ్యక్షులు గాడు పైడిరాజు మాష్టారు ( రిటైర్డ్ ) మరియు గౌరవ సలహాదారులు కంటుభుక్త ముత్యాల రావు, కనకల సన్యాసి నాయుడు, ఎల్. కాళేశ్వర రావు సభ్యులు చేట్ల గురుమూర్తి రెడ్డి, కాళ్ళ రమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam