Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖపట్నం : జూన్ 8 సాక్ష్యం న్యూస్: పది,పదకొండు తరగతుల్లో ఉన్నత ఫలితాలు సాధించడం ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవం లభించడంతో పాటు.. ఉన్నత చదువులకు సులభతరం అవుతుందని విశాఖ ఆరువేల నియ్యోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గారవ అధ్యక్షులు తల్లా ప్రగడ లక్ష్మణ రావు అన్నారు. విశాఖ బీచ్ రోడ్ లోని RK రెసిడెన్సీలో ఇటీవల పది,పదకొండు తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన ఉత్తమ విద్యార్థులకు నగదు పురాస్కారం, ప్రశంస పత్రాల పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువు తోపాటు క్రమశిక్షణ, నడవడిక కలిగి ఉండటం ఎంతో అవసరమని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సుంకరణం ప్రతాప్, కార్యదర్శి ముళ్ళపూడి కోటేశ్వరరావు, కోశాధికారి సత్యనారాయణలు విద్యార్థులకు Blessings ఇచ్చారు.
Admin
Neti Sakshyam