Monday, 24 August 2026 05:25:34 AM

సమాజ మార్పు కోసం మాతాజీ పాదయాత్ర

Date : 17 April 2026 09:11 PM Views : 172

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 17: దేశంలో కులరహిత సమైక్య సమాజం నిర్మించాలని, అంటరానితనం అంతమొందించాలని లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సేవిక సంస్థకు చెందిన సుమన పూరి మాతాజీ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం నుంచి రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు రామేశ్వరం వరకు సాగనుంది.

శుక్రవారం ఆమె తగరపువలసకు చేరుకోగా స్థానికులు స్వాగతం పలికారు. రోజుకు సుమారు 30 కిలోమీటర్లు నడుస్తూ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, స్వదేశీ వస్తువుల వినియోగం, చట్టాల గౌరవం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. పుట్టినరోజులకు చెట్లు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: