Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 14 సాక్ష్యం న్యూస్: భీమిలి బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన యన్. జనార్ధన రావుని జమ్మి చెరువు అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తమతో పాటు, తమలో ఒకరిగా ఉన్న జనార్ధన్ రావు భీమిలి బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా 5వ సారి కూడా ఎన్నికవ్వడం గొప్పవిషయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తోటి వాకర్స్ సభ్యులైన శంకర్ కుమార్,దత్తి ఈశ్వరరావు మాష్టరు, వెంకటరావు మాష్టరు, మూసా, PBMK వర్మ, సత్యనారాయణ రెడ్డి, సంకురుభుక్త జోగారావు, హేమంత్ శేఖర్, శేషు, వెంపాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని జమ్మిచెరువు పార్క్ వేదికగా ఘనంగా సన్మానించారు.
Admin
Neti Sakshyam