Thursday, 05 March 2026 03:09:20 AM

భీమిలిలో ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

Date : 05 June 2025 09:44 PM Views : 742

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 5 సాక్ష్యం న్యూస్; ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ విశాఖ నగర పరిధి భీమిలి చేపలుప్పాడ సాగర తీరంలో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని YMCA ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో INS కళింగ నావికా దళ సిబ్బంది, స్థానికులు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు. జోన్-1 కమీషనర్ ముఖ్య అథిదిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో INS కళింగ సిబ్బంది, భీమిలి YMCA సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు,జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని పిలునిచ్చారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత కోసం అవగాహన ర్యాలీ మరియు బీచ్ వద్ద మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేపట్టారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :